తెలంగాణకు హ్యుందాయ్ మెగా కారు టెస్టింగ్ కేంద్రం

-

సియోల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీమ్ అక్కడ వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతోంది. సోమవారం రోజున అరడజనుకుపైగా సంస్థలతో సమావేశమైంది. ఇందులో భాగంగా దక్షిణకొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో మెగా కారు టెస్ట్ సెంటర్‌ను స్థాపించేందుకు కంపెనీ ఆసక్తి చూపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీలో భారతీయ వినియోగదారుల కోసం బెంచ్‌మార్క్ ఉత్పత్తులు, సాంకేతికత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామ‌ని హ్యుందాయ్ ప్రతినిధులు తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. హ్యుందాయ్ మోటార్ కంపెనీ త‌న అనుబంధ సంస్థ హెచ్ఎంఐఈ ద్వారా తెలంగాణలో కార్ టెస్టింగ్ సదుపాయం నెలకొల్పేందుకు పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళిక చేస్తోందని తెలిపాయి. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగానూ భారీగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నాయి.

మరోవైపు వరంగల్ టెక్స్ టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు ఆసక్తి చూపాయి. అంతకుముందు కొరియాలోని అతిపెద్ద పారిశ్రామిక వ్యవస్థల్లో ఒకటైన LS గ్రూప్ ఛైర్మన్‌తో సమావేశమైన రేవంత్ టీమ్.. ఎలక్ట్రిక్ కేబుల్స్, బ్యాటరీల తయారీ, గ్యాస్, ఎనర్జీ తదితర రంగాల్లో పెట్టుబడుల విస్తరణకు LS గ్రూప్ ఆసక్తి కనబర్చినట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news