భారతదేశ జనాభా రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే దేశ జనాభా 2036 నాటికి 152.2 కోట్లకు చేరనున్నట్లు కేంద్ర గణాంకాలశాఖ ఆధ్వర్యంలోని సామాజిక గణాంక విభాగం ‘ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023’ నివేదిక వెల్లడించింది. అయితే అందులో మహిళల సంఖ్య పెరగనున్నట్లు తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 48.5% మహిళలతో దేశ జనాభా 121.1 కోట్లుందని పేర్కొంది. అది 2036 నాటికి 48.8% మహిళలతో 152.2 కోట్లకు చేరనుందని నివేదిక చెప్పింది. మరోవైపు 15 ఏళ్లలోపు వయసున్నవారి సంఖ్య కొంతమేర తగ్గనుందని తెలిపింది.
ఈ నివేదిక తెలిపిన వివరాలు ఇవే
2030 నాటికి దేశ జనాభా 152.2 కోట్లు
2030 నాటికి దేశజనాభాలో మహిళ శాతం 48.8%
2030 నాటికి 15 ఏళ్లలోపు వయసున్నవారి సంఖ్య తగ్గుదల
2030 నాటికి 60 ఏళ్లుపైబడిన వారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం
2036 నాటికి పని చేసే వయసున్న జనాభా పెరుగుతుంది.
2036 నాటికి 15-59 ఏళ్ల వయసున్న జనాభా 64.9శాతానికి చేరనుంది.
2036 నాటికి ప్రతి వెయ్యి మందికి 952 మహిళలు ఉంటారు.