దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏవీ రంగనాథ్ కాదు కదా ఎవడు నన్నేం చేయలేడంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు కొత్తగా వచ్చిన పదవీ ఇష్టం లేనట్లు ఉందన్నారు. అందుకే నాపైన కేసు పెట్టాడని ఆగ్రహించారు దానం నాగేందర్.
నందగిరి హిల్స్ హుడా లేఔట్ ఘటనపై..అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తానని హెచ్చరించారు బీఆర్‌ఎస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యే దానం నాగేందర్. అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని… సీఎం రేవంత్‌కు కూడా ఫిర్యాదు చేస్తానని వార్నింగ్‌ఇచ్చారు బీఆర్‌ఎస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యే దానం నాగేందర్. హైడ్రా అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవరిస్తున్నారు….నందగిరి హిల్స్ గురుబ్రహ్మ నగర్ లో పేదల గుడిసెలు కూల్చివేసే అధికారం మీకు ఎవ్వరు ఇచ్చారన్నారు. పార్కు స్థలం అని చెప్పి EVDM వాళ్ళు పెద్ద ప్రహరీ గోడ కడుతున్నారు….బస్తి వాసులకు దారి లేకుండా ప్రహరీ గోడ ఎలా కడతారు ? అని ప్రశ్నించారు.