స్కూల్‌ విద్యార్థులకు మంత్రి సీతక్క శుభవార్త..త్వరలోనే వాటి పంపిణీ

-

స్కూల్‌ విద్యార్థులకు మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల విద్యార్దుల‌కు మ‌రో జ‌త యూనిఫాం లు సిద్దం చేసి పంపిణి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వ‌హ‌ణ‌ మంత్రి సీత‌క్క రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ…స్వ‌చ్చ‌ద‌నం, ప‌చ్చ‌ద‌నం స‌క్సెస్ చేసిన అంద‌రికి అభినంద‌న‌లు చెప్పారు. జిల్లా స్థాయి అధికారుల నుంచి పారిశుద్య కార్మీకుల వ‌ర‌కు బాగా క‌ష్ట‌ప‌డ్డారని… మంచి ప‌నితీరు క‌న‌బ‌రిచిన సిబ్బందికి ఆగ‌స్టు 15న స‌న్మానిస్తామని తెలిపారు.

seethakka

గ‌తంలో పోలిస్తే ఎక్కువ ప‌ని జ‌రిగిందని… కాని మ‌రింత మెరుగు ప‌డాల్సిన అవ‌స‌రం ఉందని తెలిపారు. ఇక నుంచి ప్ర‌తి నెలా మూడు రోజుల పాటు స్వ‌చ్చ‌ద‌నం-ప‌చ్చ‌ద‌నం డ్రైవ్ కొన‌సాగుతుందని… పాముల‌తో ప్రాణాలు పోయే ప్ర‌మాదం ఉందన్నారు. క్లీనింగ్ మీద దృష్టి సారించండి…పారిశుద్య లోపాల‌పై వార్త‌లు వ‌స్తే స‌రిదిద్దండని తెలిపారు. స‌ర్పంచ్ ఎన్నిక‌ల వ‌ర‌కు అధికారులు ప్ర‌జ‌ల‌కు మ‌రింత అందుబాటులో ఉండాలని… జీపీ స్పెష‌ల్ అధికారులు ఉద‌యం క‌నీసం మూడు గంట‌ల పాటు గ్రామాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మ‌హిళా సంఘాల స‌భ్యత్వాన్ని కోటి మందికి చేర్చాలి..మ‌హిళా శ‌క్తి ప్రోగ్రాంలో ఎస్సీ, ఎస్టీ మ‌హిళ‌ల‌ భాగ‌స్వామ్యం పెంచాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news