పారిస్ ఒలింపిక్స్‌లో అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్ లింగ వివాదం రేపిన దుమారం తెలిసిందే. ఇమానె కేవలం 46 సెకన్లలోనే బౌట్‌ను గెలుచుకోవడంతో పెద్ద రచ్చ జరిగింది. అయితే ఈ ఒలింపిక్స్లో వివాదాల మధ్యే చివరికి ‘ఆమె’ బంగారు పతకం గెలుచుకుంది. అయితే అంతకుముందు ఇమానె అమ్మాయా..? లేక అబ్బాయా..? అనే వివాదం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఖెలిఫ్‌పై నిషేధం విధించాలనే డిమాండ్లూ వచ్చాయి. అయితే తాజాగా ఇమానె.. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై దావా వేయాలని నిర్ణయించుకుంది.
ఇప్పటికే ఆన్‌లైన్ వేధింపులపై ఇప్పటికే ఖెలిఫ్ కేసు నమోదు చేసింది. ఇక తాజాగా బ్రిటన్ రచయిత జేకే రౌలింగ్, ఎలాన్ మస్క్పై పరువు నష్టం దావా వేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జేకే రౌలింగ్ నేరుగా ఖెలిఫ్‌ను ఉద్దేశించి పోస్టు పెట్టగా.. బిలియనీర్ ఎలాన్ మస్క్ ఓ పోస్టుకు మద్దతు ఇచ్చాడు. దీంతో వీరిద్దరితోపాటు ఆన్‌లైన్ వేధింపులపై ఇమానె ఖెలిఫ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.