BREAKING: MP మిథున్ రెడ్డి కి CRPF భద్రత కేటాయింపు

-

MP Mithun Reddy allotted CRPF security: వైసీపీ పార్టీ MP మిథున్ రెడ్డికి కేంద్రం శుభవార్త. MP మిథున్ రెడ్డి కి CRPF భద్రత కేటాయించారు. ఈ తరుణంలోనే… తన కొత్త CRPF భద్రత సిబ్బందితో మిథున రెడ్డి కనిపించారు.

MP Mithun Reddy allotted CRPF security

ఎంపీ మిథున్ రెడ్డికు సిఆర్పిఎఫ్ భద్రత కల్పించినట్లుగా ఓ ఫోటో వైరల్‌ గా మారింది. MP మిథున్ రెడ్డి కి ప్రత్యర్థుల నుంచి హాని ఉందనే కేంద్ర ఇంటలిజెన్స్ నివేదిక తో భద్రత పెంచారు. ఇక నిరంతరంగా మిథున్ రెడ్డి గారికి సిఆర్పిఎఫ్ బలగాలతో భద్రత ఉంటుంది.

కాగా, ఇటీవలే ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ఆయన కారుపైనా టీడీపీ శ్రేణులు రాళ్లు రువ్వారు దీంతో మిథున్ రెడ్డి గన్ మెన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. టీడీపీ శ్రేణుల ఆందోళన నేపథ్యంలో ఆత్మరక్షణలో భాగంగా మూడు రౌండ్లు గాల్లోకి కాల్చారు. ఈ ఘటనలో మిథున్ రెడ్డితో పాటు వైసీపీ కార్యకర్తల కార్లు ధ్వంసం అయ్యాయి. పుంగనూరులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనను టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో వైసీపీ కార్యకర్తలతో మిథున్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news