అంగన్వాడి కేంద్రాలకు సరఫరా అవుతున్న ఆహార పదార్థాలు, కోడి గుడ్లు నాణ్యత పెంపు కోసం సప్లై కాంట్రాక్టర్లతో మంత్రి సీతక్క రివ్యూ మితిన్గ్ చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాలకు పేద పిల్లలు వస్తారు. వారికి పోషకాహారo అందించాల్సిన బాధ్యత మాది. అంగన్వాడి కేంద్రాలకు నాణ్యమైన గుడ్లు, వస్తువులు సరఫరా చేయండి.. లేకపోతే తప్పుకోండి అంటూ సప్లయర్లకు హెచ్చరికలు జారీ చేసారు.
BRS హయాంలో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న సప్లయర్లే కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు. మేము సప్లయర్లను మార్చలేదు. కాబట్టి సప్లయర్లు మరింత శ్రద్ధతో నాణ్యత పాటిస్తూ సరఫరా చేయాలి. అయితే లబ్ధిదారులు ఇంటికి తీసుకువెళ్లి చాలా రోజుల తర్వాత కోడిగుడ్లను వినియోగిస్తున్నారు. వాటివల్లే అక్కడక్కడ సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు సప్లయర్లు. టెక్ హోమ్ రేషన్ తీసుకెళ్లే వారు సకాలంలో గుడ్లను వినియోగించేలా అవగాహన కల్పించాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కోడిగుడ్ల ధరలు పెంచాలని మంత్రిని సప్లయర్లు కోరడంతో.. కాంట్రాక్ట్ మధ్యలో ధరలు పెంచడం కుదరదని తేల్చి చెప్పారు మంత్రి సీతక్క.