మెడికో హత్యాచారం.. మహిళల సేఫ్టీకి బంగాల్ స్పెషల్ యాప్

-

 కోల్‌కతా హత్యాచార ఘటన నేపథ్యంలో బంగాల్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మహిళా ఉద్యోగుల కోసం స్పెషల్ యాప్ తీసుకు రానుంది. ఎమర్జెన్సీ సమయాల్లో స్థానిక పోలీసులకు వెంటనే సమాచారం చేరవేసేందుకు మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్లు బెంగాల్ సర్కార్ తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నీ ఒంటరిగా కాకుండా ఇద్దరు మహిళలకు కలిపి నైట్‌ షిఫ్టులు వేయాలని సూచించింది. రాష్ట్రంలో రాత్రిళ్లు పోలీసు పెట్రోలింగ్‌ను పెంచుతామని వెల్లడించింది.

 రాత్రి షిఫ్టుల్లో విధులు నిర్వర్తించే మహిళల కోసం, ముఖ్యంగా ఆస్పత్రుల్లో పని చేసే మహిళల కోసం ప్రత్యేక రిటైరింగ్‌ గదులు, సీసీటీవీలు ఉండే సేఫ్‌జోన్లను ఏర్పాటు చేయాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీలు, హాస్టళ్లు, మహిళలకు రాత్రి షిఫ్టులు ఉండే ఇతర పని ప్రదేశాల్లో ‘హెల్పర్స్ ఆఫ్ ది నైట్’ పేరుతో వాలంటీర్లను అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. అన్ని రంగాల్లో మహిళలపై భద్రతపై  ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు బెంగాల్ సర్కార్ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news