భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సెక్రటరీ జే షాకు మరో కీలక పదవి దక్కేలా కనిపిస్తోంది. ఐసీసీ కొత్త చైర్మన్‌గా జై షా నియామకం కాబోతున్నారట. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సెక్రటరీ జే షా…. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) కొత్త ఛైర్మన్‌గా ప్రస్తుత గ్రెగ్ బార్క్లే స్థానంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని వర్గాలు ఎన్‌డిటివికి ధృవీకరించాయి. క్రికెట్ ఆస్ట్రేలియా చైర్ మైక్ బైర్డ్‌తో సహా ICC డైరెక్టర్లకు బార్క్లే వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా మూడోసారి ఈ పదవికి పోటీ చేసే ఉద్దేశ్యం లేదని చెప్పాడు.
నవంబర్‌లో అతనిని భర్తీ చేయాలనే జే షా ఉద్దేశాలను తెలియజేసిన తర్వాత అతని నిర్ణయం వచ్చింది. షాకు ఇంగ్లండ్ మరియు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుల మద్దతు ఉంది, అందువల్ల, ICC చీఫ్ పదవి దక్కే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. ఇప్పటి వరకు జగ్‌మోహన్ దాల్మియా (1997 నుండి 2000 వరకు) మరియు శరద్ పవార్ (2010-2012) గతంలో ఐసిసి చీఫ్‌గా పని చేశారు. వీరు ఇద్దరు భారతీయులే. ఇక ఇప్పుడు భారత హోం మంత్రి అమిత్ షా కుమారుడు కూడా మూడో వ్యక్తిగా ఆ పదవినీ స్వీకరించబోతున్నాడు అన్న మాట.