వివాహ బంధంతో ఒక్కటైన కిరణ్‌ అబ్బవరం – రహస్య గోరక్

-

కొంతకాలంగా ప్రేమలో ఉన్న టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం, నటి రహస్య గోరక్‌ తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, కొద్ది అతిథుల సమక్షంలో వీరి వివాహం గురువారం రోజున కర్ణాటకలో కూర్గ్లో జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సంబంధించి వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో వరుడు కిరణ్.. వధువు రహస్య చాలా అందంగా కనిపిస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సింపుల్ వెడ్డింగ్ అంటూ కితాబిస్తున్నారు. సో క్యూట్ పెయిర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. హ్యాపీ మ్యారిడ్ లైఫ్ అని విషెస్ చెబుతున్నారు.

‘రాజావారు రాణిగారు’ (2019)తో కిరణ్‌ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆయనకు జంటగా రహస్య నటించింది. ఈ చిత్ర షూటింగ్‌లోనే ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం.. తర్వాత ప్రేమగా మారినట్లు ఇటీవలే ఈ జంట చెప్పుకొచ్చింది. అయితే అంతకుముందు ఎన్ని రూమర్స్‌ వచ్చినా ఎప్పుడూ స్పందించని ఈ జంట ఇటీవల నిశ్చితార్థం చేసుకుని సర్ప్రైజ్ ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news