తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మునిసిపల్ ఎన్నికల సందడి నెలకొంది. జనవరి 7న ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అవుతుండగా జనవరి 22న పోలింగ్ జరుగనుంది. ఓటరు జాబితా ఇప్పటికే విడుదల కాగా… ఈ ఎన్నికల్లో ఓటు వేయాలనుకునేవారంతా ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఒకసారి ఆ ప్రాసెస్ చూస్తే;
https://tsec.gov.in/ వెబ్‌సైట్‌లో ఓటర్ స్లిప్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి, ఓటర్ ఐడీతో ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అలాగే మీ వార్డులోని మొత్తం ఓటర్ స్లిప్స్‌ని ఒకేసారి డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఈ రెండు పద్ధతుల్లో ఓటర్ స్లిప్స్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో చూద్దాం.
ముందుగా https://tsec.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే, హోమ్ పేజీలో DOWNLOAD VOTER SLIP లింక్ పైన క్లిక్ చేయండి. అప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవగానే, మీ జిల్లా పేరును ఎంచుకుని, EPIC నెంబర్ ఎంటర్ చేయండి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత Search Voter పైన క్లిక్ చేయగానే మీ ఓటర్ స్లిప్ ఓపెన్ అవుతుంది.
వార్డులోని ఓటర్ల జాబితా తీసుకోవడానికి గాను,
ముందుగా https://tsec.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే, హోమ్ పేజీలో DOWNLOAD ULB WARD WISE ELECTORAL ROLLS లింక్ పైన క్లిక్ చేయగానే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ జిల్లా పేరు, మునిసిపాలిటీ పేరు వార్డు నెంబర్ ఎంచుకోవాల్సి ఉంటుంది. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత GET DATA పైన క్లిక్ చేస్తే, మీ వార్డుకు చెందిన ఓటర్ల జాబితా ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఉంటుంది. మీరు భాష పైన క్లిక్ చేస్తే మీ వార్డులోని ఓటర్లందరి ఓటర్ స్లిప్స్ కనిపిస్తాయి. అందులో మీ కుటుంబానికి చెందిన ఓటరు జాబితా సెలెక్ట్ చేసి ప్రింట్ తీసుకునే సదుపాయం ఉంటుంది.