అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ ఇంటర్నెట్లో వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. చాలామంది బయట మ్యాంగో జ్యూస్లని కొనుగోలు చేస్తూ ఉంటారు. టెట్రా ప్యాక్ లో మ్యాంగో జ్యూస్ మనకి అందుబాటులో ఉంటుంది. అయితే చాలామంది వీటి వలన ప్రమాదం కలుగుతుందనే విషయాన్ని పట్టించుకోరు. తాజాగా ఒక కంటెంట్ క్రియేటర్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఒక బకెట్లో మ్యాంగో జ్యూస్ ని కంటైనర్ లో వేసి తయారు చేస్తున్నారు.
సరిగ్గా చూసినట్లయితే ఇది మ్యాంగో జ్యూస్ కాదని ఆర్టిఫిషియల్ పెయింట్ అని అర్థమవుతుంది. ఈ పెయింట్ లో కొంచెం వైట్ పౌడర్ అలాగే రెడ్ పెయింట్ వేశారు ఇందులో ఏ పదార్థాలు వేశారు అనే దాని గురించి వివరాలు అయితే లేవు. ఈ ఫ్యాక్టరీలో పని చేసే వర్కర్స్ అసలు హైజిన్ ని పాటించట్లేదు. చేతికి గ్లౌజులు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు.
View this post on Instagram
వట్టి చేతులతో ఈ జ్యూస్ ని తయారు చేస్తున్నారు. ఇలాంటి టెట్రా ప్యాక్ జ్యూస్లను తాగితే కచ్చితంగా ఆరోగ్యం షెడ్డుకి వెళ్ళిపోతుంది. బాక్సుల్లో ప్యాకెట్లను పెట్టేసి టేప్ వేసి ప్యాకింగ్ పూర్తి చేసేస్తున్నారు. వీటిని మార్కెట్లో అమ్మేస్తున్నారు. ఈ వీడియోకి ఇప్పటివరకు ఐదు మిలియన్ వ్యూస్ వచ్చాయి. చాలామంది దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇలాంటి జ్యూస్ లపై మీ అభిప్రాయం ఏంటో తెలపండి.