జస్టీస్ హేమ కమిటీ నివేదిక మలయాళ సినీ పరిశ్రమను కుదిపేస్తున్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంలో కేవలం అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ ను లక్ష్యంగా చేసుకోవద్దని అమ్మ మాజీ అధ్యక్షుడు మోహన్ లాల్ విజ్ఞప్తి చేశారు. హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నామని.. ఆ నివేదికను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సరైందేనన్నారు.
ఇక దాదాపు అన్ని ప్రశ్నలకు అమ్మ సమాధానం ఇవ్వడం సాధ్యం కాదన్నారు. మలయాళ సినీ పరిశ్రమ చాలా కష్టపడి పని చేసే పరిశ్రమ అని.. ఇందులో చాలా మంది ఉన్నారని.. అందరినీ నిందించలేమని తెలిపారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు జరుగుతున్న సమయంలో దయచేసి పరిశ్రమను నాశనం చేయకండి అని విజ్ఞప్తి చేశారు. దోషులకు శిక్ష తప్పదని స్పష్టం చేశారు. మలయాళ సినీ పరిశ్రమ లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఇటీవలే అమ్మ అధ్యక్ష పదవీకి మోహన్ లాల్ రాజీనామా చేసారు.