హైడ్రా పేరుతో భారీగా వసూళ్లు.. కమిషనర్ రంగనాథ్ వార్నింగ్

-

హైడ్రా పేరుతో ఎవరైనా బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కమిషనర్ రంగనాథ్ హెచ్చిరించారు.సామాజిక కార్యకర్తల ముసుగులో బిల్డర్లను బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, హైడ్రా విభాగంలోని ఉన్నతాధికారులతో తమకు పరిచయాలు ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలియవచ్చిందన్నారు. హైడ్రా విభాగాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ వార్నింగ్ ఇచ్చారు.

హైడ్రా పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేసినా, బెదిరింపులకు పాల్పడినా, ఒత్తిడిలకు గురిచేసినా తమకు సమాచారం ఇవ్వాలని లేదా స్థానిక పోలీసులకు, ఏసీబీకి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. తాజాగా హైడ్రా పేరుతో అమీన్ పూర్‌లో డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నా విప్లవ్ సిన్హాను పోలీసులు అరెస్టు చేసినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. కాగా, చెరువులు బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news