వరద బీభత్సం.. ఐదు రోజులుగా కలెక్టరేట్‌లోనే సీఎం చంద్రబాబు!

-

గత వారం రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం వానలు కాస్త తగ్గుముఖం పట్టినా మళ్లీ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఏపీని హెచ్చరించింది. ఇటీవల కురిసిన భారీవర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో బుడమేరు వాగు ఉప్పొంగి విజయవాడ నగరం మొత్తం నీట మునిగింది. దీంతో ముంపు గ్రామాల బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వం కోల్పోయిన మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

ఈ క్రమంలోనే సహాయక చర్యల్లో పాల్గొన్నసీఎం చంద్రబాబు గత ఐదు రోజులుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లోనే ఉంటూ నిత్యం సహాయక చర్యలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. కాగా, బాధితులకు పరిహారం కోసం జరిగిన నష్టంపై అంచనా వేయడంతో పాటు బాధితులకు ఉన్న బ్యాంకు ఈఎంఐలను రీషెడ్యూల్ చేయాలని సీఎం చంద్రబాబు బ్యాంకర్లను కోరారు. అందుకోసం బుధవారం బ్యాంకర్లతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులను అప్రమత్తం చేశారు.ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి నివేదికలు అందజేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news