గణేష్ మండపాలకు ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదన్నారు ఏపీ హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత. 2022లోనే గత ప్రభుత్వం గణేష్ మండపాలకు సంబంధించి జీవో ఇచ్చిందని…. మేము ఆ జీవోలో ఉన్న దానిని చెప్పామంతేనన్నారు. కానీ, సింగిల్ విండో విధానంలోనే గణేష్ మండపాలకు అనుమతి ఇవ్వడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వ జీవోలో ఉన్న అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకురావడం జరిగిందని వివరించారు.
ఎలాంటి డబ్బులు వసూలు చేయకూడదని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని… సీఎం ఆదేశాలను మేము 10 రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించామన్నారు. గణేష్ మండపాలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు ఏపీ హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత. మైక్ పర్మిషన్ కు కూడా డబ్బులు తీసుకోవడం లేదని.. ఆంధ్ర ప్రదేవ్ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయన్నారు ఏపీ హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత.