సూపర్ స్టార్ వెట్టైయాన్ నుంచి కీలక అప్డేట్.. ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..?

-

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నటనలో ఆయనకెవ్వరూ సాటిలేరనే విధంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇటీవలే జైలర్ సినిమాలో నటించి మంచి హిట్ సాధించారు. అదే ఫామ్ తో వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం తలైవా నటిస్తున్న తాజా చిత్రం వెట్టైయాన్. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దసరా కానుకగా అక్టోబర్ 10న తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ వంటి భాషల్లో విడుదల కాబోతుంది.

వెట్టైయాన్ చిత్రాన్ని టీ.జె.జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. అయితే ఇప్పటికే వెట్టెయాన్ నుంచి విడుదలైన అప్డేట్స్ మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. తాజాగా వెట్టెయాన్ మూవీ నుంచి అప్డేట్ విడుదల చేస్తూ మేకర్స్ తలైవా పోస్టర్ ని వదిలారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘మనసిలాయో’ సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మీ స్పీకర్లను  సిద్ధంగా ఉంచుకోండి! అనే క్యాప్షన్ జత చేయడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news