ఏపీ పోలీసు విభాగానికి కేంద్ర పురస్కారం!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ విభాగానికి కేంద్ర పురస్కారం లభించింది. సామాజిక మాధ్యమాల్లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఏపీ పోలీసు విభాగానికి కేంద్ర ప్రభుత్వం పురస్కారాన్ని ప్రకటించింది.దేవ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఏపీ సీఐడీ విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్, సీఐడీ మహిళా సంరక్షణ విభాగం ఎస్పీ కేజీవి సరిత కేంద్ర పురస్కారాన్ని అందుకున్నారు.

ఇండియన్ సైబర్ కో ఆర్టినేషన్ సెంటర్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నిషన్’‌ను వారికి కేంద్రమంత్రి అందజేశారు. అయితే, ఏపీలో ఆన్ లైన్ మోసాలు, సైబర్ దాడులు, లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులను ఏపీ పోలీసు విభాగం అత్యంత సమర్థవంతంగా పరిష్కరించింది. హ్యుమన్ ట్రాఫికింగ్ కేసులో సైతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏపీ పోలీసులు కేవలం 48 గంటల్లో అమ్మాయిని తీసుకొచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించిన విషయం తెలిసిందే.

 

 

Read more RELATED
Recommended to you

Latest news