మహిళల్లో డెలివరీ తర్వాత చాలా సమస్యలు వస్తాయి. ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. డెలివరీ తర్వాత కామన్ గా మహిళల్లో వచ్చే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భం దాల్చిన సమయం నుంచి బిడ్డ పుట్టినంత వరకు కూడా తల్లి శరీరం అనేక మార్పులకు గురవుతుంది. డెలివరీ తర్వాత కొన్ని సమస్యలు తప్పవు.
హెవీ బ్లీడింగ్
ప్రసవమైన తర్వాత 12 వారాలు పాటు రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. ప్రసవం అయిన 24 గంటలు ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది.
ఇన్ఫెక్షన్స్
డెలివరీ తర్వాత మూత్ర మార్గంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. యాంటీబయాటిక్స్ లేదంటే పెయిన్ కిల్లర్స్ వాడితే తగ్గుతుంది.
యూరిన్ ఇన్ఫెక్షన్
డెలివరీ తర్వాత మహిళల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్య కూడా ఎక్కువగా వస్తుంది. పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనంగా ఉండడం వలన ఈ సమస్య కలుగుతుంది.
రొమ్ము నొప్పి
మహిళలను ఈ సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. రొమ్ము నొప్పి విపరీతంగా నొప్పి ఉంటుంది. హీట్ కంప్రెసర్ ఉపయోగిస్తే రిలీఫ్ కలుగుతుంది.
మానసిక సమస్య
డెలివరీ తర్వాత మహిళల్లో మానసిక సమస్యలు తీవ్రంగా ఉంటాయి. డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది.
పెల్విట్ ఫ్లోర్ డిజార్డర్స్
డెలివరీ అయిన తర్వాత మహిళల్లో పెల్విక్ ఫ్లోర్ డిసార్డర్స్ ఎక్కువగా ఉంటాయి. పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనంగా మారడం వలన ఈ సమస్య కలుగుతుంది.
యోని నొప్పి
ప్రసవ సమయంలో మహిళల్లో యోని భాగంలో నొప్పి ఎక్కువ ఉంటుంది. ప్రసవం తర్వాత కూడా నొప్పి ఉంటుంది.