సెటిలర్లందరూ తెలంగాణ బిడ్డలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద అరికెపూడి గాంధీ దాడి చేసిన నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించారు కేటీఆర్. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. హైదరాబాద్ లో పదేళ్లలో శాంతి భద్రతలు అద్భుతంగా మెయింటైన్ చేసామని… హైదరాబాద్ లో ఉన్న ప్రజలు అందరు మా వారేనని తెలిపారు.
ప్రాంతీయతత్వం మీద దాడులు గతంలో లేవు ఇప్పుడు ఉండవని వివరించారు. బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ ప్రజలు అండగా నిలిచారని రేవంత్ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ఆగ్రహించారు. కాంగ్రెస్ లో ఎందుకు చేరావ్… దిక్కుమాలిన pac పదవి కోసం ఇలాంటి మాటలు మాట్లాడిన గాంధీకి సిగ్గుండాలని ఆగ్రహించారు. ఒక్కసారి నియోజకవర్గ ప్రజలను అడిగితే… గాంధీ ఏ పార్టీలో ఉన్నాడో చెబుతారన్నారు. గాంధీని హౌజ్ అరెస్ట్ చేస్తే ఇలాంటి సంఘటనలు జరిగేవి కావని వివరించారు.