గణేష్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేసింది GHMC. అయితే ఈ విషయం పై కమిషనర్ ఆమ్రపాలి స్పందించారు. ఈనెల 17న జరిగే గణేష్ నిమజ్జనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా జిహెచ్ఎంసి పటిష్ట ఏర్పాట్లు చేసింది. మండపాల నుండి నిమజ్జనం వరకు వెళ్లే దారిలో రోడ్డు మరమ్మతులు, స్ట్రీట్ లైట్ల ఏర్పాట్లు, ట్రీ ట్యూనింగ్ పనులు పూర్తి చేసాము. GHMC పరిధిలో మొత్తం 73 పాండ్స్ ఏర్పాటు చేశాం. అందులో 27 బేబీ పాండ్స్, 24 ఫోర్టబుల్, 22 ఎక్సలేటర్ పాండ్స్ ఏర్పాటు చేశాం. అన్ని పాండ్స్ వద్ద అవసరమైన త్రాగునీరు, శానిటేషన్ ఏర్పాటు కు సిద్దం చేశాం.
73 పాండ్స్ తో పాటు సరూర్‌నగర్ పెద్ద చెరువు, జీడిమెట్ల ఫాక్స్ సాగర్, బహదూర్‌పుర మిరాలాం చెరువు, కాప్రా ఊర చెరువుల వద్ద నిమజ్జనం ఏర్పాట్లు చేసాము. భక్తుల సౌకర్యార్థం మొత్తం 308 మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశాం. తాత్కాలిక స్ట్రీట్ లైట్ల తో పాటు అవసరమైన చోట బోజన కేంద్రాలు ఏర్పాటు చేశాం అని ఆమ్రపాలి పేర్కొన్నారు.