చిన్నపిల్లలకు తినే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి మంచి బలం, పోషకాహారం అందాలని డ్రైఫ్రూట్స్ అన్నింటిని కలిపి పొడి చేసి పాలల్లో కలిపి ఇస్తుంటారు. ఇంకా ఫ్రూట్‌ను కూడా..ఉడకపెట్టి ఇస్తుంటారు. యాపిల్‌ను మెత్తగా స్ట్రీమ్ చేసి దాన్ని ముద్దలు ముద్దలుగా కలిపి పళ్లు కూడా రాని పిల్లలకు ఇస్తారు. ఇదంతా మంచి విషయమే. కానీ పిల్లలకు కొన్ని ఫ్రూట్స్ ఇవ్వకూడదని నిపుణులు అంటున్నారు. అరటిపండు అయితే మొత్తగే ఉంటుంది కాబట్టి దీన్ని బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. మెత్తగా చేసి ఇచ్చేస్తుంటారు. అయితే వారికి అరటిపండు తినిపించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం.
పిల్లలకు దగ్గు లేదా జలుబు ఉంటే అరటిపండు అస్సలు ఇవ్వకండి. ఇది దగ్గును మరింత ఎక్కువ చేస్తుంది. ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఇది పిల్లలకి చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. మీ బిడ్డకు 6 నెలలు దాటిన తర్వాత డాక్టర్ సలహాతో ఘన పదార్థాలను ఇవ్వడం మంచిది. బిడ్డకు ఆహారంలో అరటిపండును చేర్చవచ్చు. ఇది బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. కానీ అతిగా ఇస్తే.. వారి ఆకలిని దెబ్బతీస్తుంది. ఇది పాలు, ఇతర ఆహార పదార్థాలపై ఆకలిని తగ్గించవచ్చు.
మొదటి సారి అరటి పండును తినిపించేటప్పుడు దానిని పేస్ట్‌గా చేసి పెట్టండి. ఇలా చేయడం ద్వారా అతను సులభంగా తినవచ్చు. రాత్రిపూట మీ పిల్లలకు అరటిపండు ఇవ్వకండి. ఇలా చేయడం వల్ల గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. పిల్లలకు పూర్తిగా పండిన అరటిపండు మాత్రమే తినిపించండి. ఎందుకంటే అలాంటి పరిస్థితిలో పిల్లలకు జీర్ణం కావడం సులభం అవుతుంది.
ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుని పిల్లలకు పండ్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది కదా అని.. పెట్టేయడకూడదు. దానివల్ల లేనిపోని సమస్యలు వస్తాయి. అలాగే ఎక్కువగా పుల్లగా ఉండే పండ్లను కూడా పిల్లలకు అతిగా పెట్టకూడదు. అలాగే అందరు పిల్లలకు అన్నీ పండ్లు సరిపోవు. వారి ఆరోగ్యాన్ని బట్టి కొన్ని ఇవ్వకూడనివి, ఇవ్వాల్సిని ఉంటాయి. డాక్టర్ సూచన మేరకే పండ్లు పెట్టాల్సి ఉంటుంది.