ప్రతి ఒక్కరు కూడా సంపదను పెంచుకోవాలని చూస్తారు. సంతోషంగా కుటుంబంతో ఉండాలని అనుకుంటారు. అయితే చాలా వరకు సంపాదన ట్యాక్స్ల రూపంలోనే పోతుంది ఏడు లక్షలు వరకు ఆదాయ పన్ను మినహాయింపు పొందే అవకాశాన్ని భార్యా భర్త ఉమ్మడి అవసరాలు తీర్చుకుంటూ ఇలా సేవ్ చేసుకోవచ్చు. వివాహిత జంటలు పెళ్లి తర్వాత చదువుకోవడం పై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు లోన్స్ సౌకర్యాన్ని పొందవచ్చు. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది ఆ రుణానికి వాయిదా పై పన్ను మినహాయింపు లభిస్తుంది.
వడ్డీ పై ఎనిమిది సంవత్సరాల పాటు ట్యాక్స్ బెనిఫిట్ ని పొందవచ్చు. భార్య పేరు మీద రుణం తీసుకునేటప్పుడు దానిని విద్యార్థి రుణంగా తీసుకోవచ్చు. ఈ రుణాన్ని ప్రభుత్వ బ్యాంకు, ప్రభుత్వ అధికృత బ్యాంకు, ప్రభుత్వ సంస్థల నుంచి పొందడానికి అవుతుంది. స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష దాకా మూలధన లాభాలపై పన్ను మినహాయింపు ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మీ భార్య ఆదాయం తక్కువగా ఉన్నా లేదంటే ఆమె గృహిణి అయితే మీరు ఆమె పేరు మీద స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టవచ్చు. ఈ విధంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టిన డబ్బు నుంచి వచ్చే ఆదాయంపై భార్యకు లక్ష వరకు మూలధన లాభాలపై పన్ను మినహాయింపు ఉంటుంది.
లక్ష మూలధన లాభం ఉంటే భార్య పేరు మీద ఇంకో లక్ష వస్తుంది అంటే రెండు లక్షలు వస్తాయి సొంత ఇంటిని నిర్మించుకోవడానికి ఉమ్మడి రుణం తీసుకోవడం ద్వారా పన్ను ఆదా చేసుకోవడానికి అవుతుంది. ఇల్లు ఇద్దరు పేద మీద నమోదు చేసుకుంటే ఇద్దరూ హౌసింగ్ లోన్ పై పన్ను ప్రయోజనాలని పొందవచ్చు. ఇద్దరూ ఒక్కొక్కరు 1.5 లక్షలు అంటే మొత్తం మూడు లక్షలు ఆదా చేసుకోవడానికి అవుతుంది. సెక్షన్ 80 సి కింద పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు సెక్షన్ 24 కింద వడ్డీ పై ఇద్దరు ఒక్కొకరు రెండు లక్షల పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు మొత్తం మీద ఏడు లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందడానికి అవుతుంది.