వినాయకుడి నిమజ్జనంలో డాన్స్ వేసిన రేవంత్ రెడ్డి మనవడు

-

వినాయకుడి నిమజ్జనంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మనవడు రేయాన్ష్ రెడ్డి డాన్స్ వేశారు.దీనికి సంబందించిన వీడియో వైరల్ గా మారింది. ఇక అటు ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభించాలని ముందుగా ప్లాన్ చేశారు. కానీ అంతలోనే ప్లాన్ మార్చి ఉదయం 6 గంటల నుంచి… శోభయాత్రను ప్రారంభించడం జరిగింది. దీంతో ఇవాళ ఉదయం నుంచే శోభయాత్ర ప్రారంభమై దాదాపు సగం దూరం వరకు వెళ్లింది.

ఈ నేపథ్యంలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొంటున్నారు. అంతేకాదు ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రలో డాన్స్ కూడా చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా హుస్సేన్ సాగర్ లోని క్రెన్ నెంబర్ 4 దగ్గర మహాగణపతిని నిమజ్జనం చేసే ఛాన్స్ ఉంది. ఇవాళ మధ్యాహ్నం 12 లేదా మధ్యాహ్నం ఒకటి గంటల వరకు మహాగణపతి నిమజ్జనం కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news