ఆర్టికల్ 370పై మౌనం పాటిస్తోన్న కాంగ్రెస్.. సంక్షేమాలకే పెద్దపీట!

-

జమ్ముకాశ్మీర్‌ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఎలక్షన్ కమిషన్ పూర్తిచేయగా.. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోయే పార్టీలు కొత్త అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు ఈ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారనుంది. బీజేపీ దీనిని రద్దు చేశాక రాష్ట్రంలో తొలిసారి ఎన్నికలను నిర్వహిస్తోంది. అయితే, గతంలో తాము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.

మిగతా ప్రాంతీయ పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పార్టీలు మాత్రం ఆర్టికల్ 370 మీద మాట్లాడుతున్నాయి. టెక్నికల్‌గా అది సాధ్యం కాదని, కలలు కనొద్దని కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టంచేశారు.గతంలోనూ అమిత్ షా కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని చెప్పి కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లాలని పిలుపునిచ్చారు. కానీ, దీనికి హస్తం పార్టీ బదులివ్వలేదు.ఇప్పుడు కూడా మౌనం పాటిస్తోంది. ఎందుకంటే దాని ఎఫెక్ట్ మళ్లీ వచ్చే సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే కేవలం సంక్షేమ పథకాలకే పెద్దపీట వేస్తోంది. కాగా, జమ్ములో కాంగ్రెస్, ఎన్సీ పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news