దేశరాజధాని ఢిల్లీకి నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న ఆప్ మంత్రి అతిశీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని తిహార్ జైలులో ఆరు నెలలు ఉన్న మాజీ సీఎం కేజ్రీవాల్.. వచ్చే ఎన్నికల్లో తనను తాను నిర్దోశిగా ప్రకటించుకునేందుకు మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు తాను నిర్దోశినో కాదో వచ్చే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తాయని స్టేట్మెంట్ ఇచ్చారు.
ఈ క్రమంలో పార్టీ మీటింగ్ నిర్వహించి తదుపరి సీఎంగా అతిశీ పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించారు. ఈ నిర్ణయాన్ని ఆప్ ఎమ్మెల్యేలు అంతా ఆమోదించారు.త్వరలోనే సీఎంగా అతిశీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, అతిశీ రాజకీయాల్లోకి రాకముందు టీచర్‌గా పనిచేశారు. ఏపీలోని మదనపల్లె సమీపంలోని రిషి వ్యాలీ స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పారు. ఆ తర్వాత 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఢిల్లీ విద్యాశాఖమంత్రి మనీశ్ సిసోడియాకు సలహాదారుగాను వ్యవహరించారు. అనంతరం ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. కేజ్రీవాల్, మనిష్ సిసోడియా జైలులో ఉన్న సమయంలో అన్నీ తానై పార్టీని ముందుండి నడిపించారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ అతిశీకి సీఎంగా బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.