వివాదంలో దానం నాగేందర్..కంగనా పై హాట్ కామెంట్స్..!

-

కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీజేపీ హిమాచల్ ప్రదేశ్ మండి ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ పై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి.  రాహుల్ గాంధీ లక్ష్యంగా బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను నిరసిస్తూ.. గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ నిర్వహించిన ధర్నాలో దానం నాగేందర్ మాట్లాడారు.  సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా రనౌత్ కు రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై బీజేపీ నేతలు విమర్శలు చేయడాన్ని దేశ ప్రజలు సహించరన్నారు.

రాహుల్ గాంధీపై అనుచిత విమర్శలు చేసిన ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్వీందర్ సింగ్ పై, ఇతర బీజేపీ నేతలపైన సుప్రీం కోర్టు, ఢిల్లీ కోర్టు, డీజీపీలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా కంగనా రనౌత్ కి ఈ మధ్య ఇబ్బందులు చాలా ఎక్కువయ్యాయి. ఛండీఘడ్ లోని ఓ జిల్లా కోర్టు కంగనాకు నోటీసులు జారీ చేసింది. ఎమర్జెన్సీ చిత్రంతో కంగనా కాంగ్రెస్ శ్రేణులకు టార్గెట్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news