గుండె నుంచి చర్మం వరకు చనిపోయిన తర్వాత ఎలాంటి మార్పులొస్తాయి..? ఏ సమయంలో ఏమవుతుందంటే..?

-

చనిపోయిన తర్వాత అసలు మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి..? చనిపోయిన గంట వరకు శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి..? ఆ తర్వాత ఎలాంటి మార్పులు వస్తాయి ఇవన్నీ తెలుసుకోవడం ఆసక్తిగా ఉంటుంది కదా..? మరి ఇప్పుడే చూసేయండి. చనిపోయిన తర్వాత రకరకాల మార్పులు మన బాడీలో మొదలవుతాయి. చనిపోయిన కొద్ది గంటలకి గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఎందుకంటే ఆక్సిజన్ అందదు. కాబట్టి గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. అలాగే కొన్ని క్షణాల్లో అయితే బ్రెయిన్ సెల్స్ చచ్చిపోతాయి లివర్ తన పనిని ఆపేస్తుంది. బ్లడ్ లో మార్పు వస్తుంది. బ్లడ్ కదలకుండా ఆగిపోతుంది.

చర్మం రంగును మార్చేస్తుంది. కండరాలు ఫ్లెక్సిబిలిటీని కోల్పోతాయి. ఇవన్నీ కేవలం రెండు నుంచి ఆరు గంటల్లో జరుగుతాయి. ముందు కళ్ళు, దంతాలు వంటివి ఎఫెక్ట్ అవుతాయి. ఆ తర్వాత నెమ్మదిగా మొత్తం శరీరం పై ప్రభావం పడుతుంది. కళ్ళు కాస్త మారడానికి 6 గంటల సమయం పడుతుంది. కానీ కంటి రెప్పలు పడకుండా ఉండిపోతాయి.

చనిపోయిన వెంటనే

  • గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది
  • వెంటనే ఊపిరితిత్తులు ఆక్సిజన్ సప్లై ని ఆపేస్తాయి
  • మూడు నుంచి ఏడు నిమిషాల్లో బ్రెయిన్ సెల్స్ చచ్చిపోతాయి
  • బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది

గంట సమయంలో

  • చర్మం రంగును కోల్పోతుంది
  • కండరాలు ఫ్లెక్సిబిలిటీని కోల్పోతాయి
  • లివర్ పనితీరు ఆగిపోతుంది

రెండు నుంచి ఆరు గంటలు

  • కార్నియాలు ఆరు గంటల వరకు ఆచరణీయంగా ఉండొచ్చు
  • కనురెప్పలు దవడ వంటి చిన్న కండరాల్లో గట్టిపడడం మొదలవుతాయి

6 నుంచి 12 గంటలు

  • పూర్తి దృఢమైన మార్టిస్ ఏర్పడుతుంది
  • అవయవాలు వంటి పెద్ద కండరాలపై ప్రభావితం చేస్తుంది.
  • జీర్ణ ఎంజైలు కడుపు మరియు పేగుల్లోని కణజాలాలను విచ్ఛిన్నం చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news