చెన్నై వేదికగా జరుగుతున్న చెపాక్ టెస్టులో బంగ్లా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ముష్ఫికర్ రహీం 8 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో కేవలం 14 ఓవర్లకు బంగ్లా స్కోర్ -44/5 గా ఉంది. ప్రస్తుతం క్రీజులో షకీబ్(8), లిట్టన్‌దాస్(0) ఉన్నారు.కెప్టెన్ శాంటో 20పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.
బంగ్లాతో జరిగే టెస్టులో భారత పేసర్ ఆకాష్ దీప్ నిప్పులు చెరుగుతున్నాడు. 9వ ఓవర్‌లో తొలి బంతికి జకీర్ హసన్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆకాష్..రెండో బంతికి మోమినుల్ హక్ అదే తరహాలో ఔట్ చేశాడు. 9 ఓవర్లు ముగిసే సరికి బంగ్లా 3 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది.తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బంగ్లాదేశ్‌కు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆరంభంలోనే షాకిచ్చాడు. బంగ్లా ఓపెనర్ షాద్‌మన్ ఇస్లాం(2)ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు.ఇక భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది.339/9 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టు అదనంగా కేవలం 37 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండో రోజు పేసర్ టాస్కిన్ ఆహ్మద్ 3 వికెట్ల పడగొట్టి భారత్ జట్టను దెబ్బతిశాడు.