ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ కోసం క్యూఆర్ కోడ్ పేమెంట్

-

తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు ఇక నుంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సాధారణంగా ప్రయాణికులు టికెట్ తీసుకునేందుకు  చిల్లర కోసం ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని సందర్భాల్లో చిల్లర లేక కండెక్టర్, ప్రయాణికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కావడంతో కాస్త గొడవలు తగ్గాయి. లేదంటే కండెక్టర్లతో చిల్లర గొడవలు గతంలో చాలానే జరిగేవి.

వీటన్నింటికి చెక్ పెడుతూ.. ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ కోసం క్యూఆర్ కోడ్ పేమెంట్ ఫోన్ పే, గూగుల్ పే, స్కాన్ సిస్టమ్, క్రెటిట్, డెబిట్ కార్డులతో అన్నిరకాల డిజిటల్ చెల్లింపులు ఆక్సెప్ట్ చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్  ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఈ విషయం తెలిసిన ప్రయాణికులు సంబుర పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news