జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో ఆయన భార్యపై కూడా… వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవాళ లేదా రేపు… జానీ మాస్టర్ భార్య పైన కూడా కేసు పెట్టేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారట. బాధిత మహిళను వేధింపులకు గురిచేసిన కేసులో… జానీ మాస్టర్ భార్య పాత్ర కూడా ఉందని సమాచారం.
అందుకే నిందితురాలుగా జానీ మాస్టర్ భార్య పేరును కూడా పెట్టేందుకు సిద్ధమయ్యారట. జానీ మాస్టర్ భార్య తో పాటు మరో ఇద్దరు పేరు.. కూడా తెరపైకి వచ్చినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా ఈ కేసులో జానీ మాస్టర్ కు కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజులపాటు చర్లపల్లి జైల్లో చిప్పకూడు తిననున్నారు జానీ మాస్టర్. అంటే దాదాపు అక్టోబర్ మూడో తేదీ వరకు ఆయన రిమాండ్ కొనసాగనుంది. ఆలోపు ఈ కేసులో పూర్తి వివరాలు బయటకు వస్తాయి.