లిఫ్ట్ లో అద్దం ఎందుకు ఉంటుంది..? కారణం తెలుసా..?

-

లిఫ్ట్స్ వలన ఎక్కువ మెట్లు ఎక్కాల్సిన పని లేకుండా పోయింది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో షాపింగ్ మాల్స్ లో హాస్పిటల్స్ లో ఏ ఫ్లోర్ కి వెళ్ళాలన్నా ఈజీగా మనం లిఫ్ట్ లో వెళ్లొచ్చు. అయితే లిఫ్ట్ లో గమనించినట్లయితే అద్దం ఉంటుంది. ఎందుకు లిఫ్ట్స్ లో వీటిని పెడతారు దాని వెనుక కారణం ఏంటి అనేది చూద్దాం. చాలామందికి ఈ విషయం తెలియకపోయి ఉండొచ్చు. లిఫ్ట్ ఎక్కినప్పుడు మనతో పాటు చాలామంది ఉంటారు వారిలో మనకు తెలియని వారు కూడా ఉంటారు. అలాంటప్పుడు ఒకసారి భయం కలుగుతుంది. అద్దం ఉంటే వారిని కనిపెడుతూ ఉండవచ్చు. గుంపులో ఎవరైనా దొంగతనానికి పాల్పడుతున్నారా అనేది కూడా మనం కనిపెట్టొచ్చు ఇలా సేఫ్టీ కోసం లిఫ్ట్ లో అద్దాన్ని పెడతారు.

అలాగే ఇంకొక కారణం కూడా ఉంది. లిఫ్ట్ లో అద్దాన్ని మొదట జపాన్ లో ప్రవేశపెట్టారు వికలాంగులు వీల్ చైర్ వాడేవాళ్లు మెట్లు ఎక్కాలంటే ఇబ్బంది ఉంటుంది. అందుకని అలాంటి వారి కోసం లిఫ్ట్ కనిపెట్టారు. అద్దం సాయంతో వారు ఎక్కడ ఖాళీ ఉందో చూసుకుని వీల్ చైర్ సర్దుబాటు చేసుకుంటారు. ఇలాంటి ప్రయోజనాల కోసం ఎలివేటర్లలో అద్దాలని పెట్టడం జరుగుతుంది. లిఫ్ట్ లో సాధారణంగా ఎక్కువ ప్లేస్ లేకపోవడం వలన తాజా గాలి తగలదు దీంతో చాలా మందికి క్లాస్ట్రో ఫోబియా సమస్య ఎదురవుతుంది.

ఈ సమస్య ఎదురైనప్పుడు ఆందోళన పెరుగుతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. చెమటలు పడతాయి. లిఫ్ట్ లో అద్దం ఉండడం వలన దాన్ని చూడడం వలన ఎటువంటి ఆందోళన ఉండదు. ఇరుకుగా ఉండే ఫీలింగ్ కూడా రాదు. లిఫ్ట్ లో నిలబడినప్పుడు బోర్ గా ఫీల్ అవ్వకుండా తనని తాను చూసుకుంటూ ఇతరులని కూడా గమనించొచ్చు. ఇలా ఈ పలు కారణాల వలన లిఫ్ట్ లో అద్దాలని ఉంచుతారు.

Read more RELATED
Recommended to you

Latest news