“మంచి ప్రభుత్వంలో” పవన్ ఎక్కడ..? రగిలిపోతున్న జనసైనికులు..

-

వైసీపీ దెబ్బకు కకావికలం అయిన తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ ఊపిరిపోశారు.. పార్టీతో పొత్తు పెట్టుకుని.. బిజేపీని, టీడీపీ కలిపారు.. దీంతో ముగ్గురు కలిసి వైసీపీని చావుదెబ్బకొట్టారు.. పవన్ కళ్యాణ్ జతకట్టకపోతే.. టీడీపీకి మరోసారి ఘోర ఓటమి ఎదురయ్యేదని తెలుగుదేశం పార్టీ నేతలు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కు సముచిత స్తానం కల్పించారు చంద్రబాబు.. డిప్యూటీ సీఎంగా వపన్ ను కూర్చొనిబెట్టారు.. సీన్ కట్ చేస్తే..

వందరోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్బంగా..టీడీపీ పెద్ద ఎత్తున పబ్లిసిటీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. ఛానెల్స్తో పాటు.. పేపర్లకు కూడా ప్రకటనలు ఇస్తోంది.. ఇదే ఇప్పుడు జనసైనికులకు మండేలా చేస్తోంది.. ఈ ప్రకటనలో చంద్రబాబు పోటో మాత్రమే ఉండటం.. పవన్ కళ్యాణ్ సోయ కూడా లేకపోవడంతో జనసైనికులు రగిలిపోతున్నారు.. పవన్ కళ్యాణ్ కు గౌవరం కల్పిస్తామని చెప్పే చంద్రబాబు నాయుడు.. ప్రకటనలలో మాత్రం పవన్ పోటో కూడాలేకుండా చేశారని ఆగ్రహిస్తున్నారట..

ఎన్నికల సమయంలో ప్రకటనలలో, ప్రచారాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పోటోలే దర్శనమిచ్చేవి.. పవన్ కళ్యాణ్ ను పొగడని స్టేజీ లేదు.. కార్యక్రమమూ లేదూ.. కానీ.. కూటమి ప్రభుత్వం వందరోజులు పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్‌ ను తప్పించారనే గాసిప్స్ జనసేన నుంచి వినిపిస్తున్నాయి.. టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి త్యాగాలు చేసిన పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నాయుడు తగిన గౌరవం ఇవ్వడం లేదనే ఆవేదన పార్టీ కార్యకర్తల్లో కనిపిస్తోంది.. ఎన్నికల హామీలను అమలు చేసే బాధ్యత తమదని పవన్ కళ్యాణ్, చంద్రబాబు చెప్పారు..మేనిపెస్టోలో కూడా ఇద్దరి పోటోలు ఉన్నాయి.. కానీ మంచి ప్రభుత్వం అంటూ రెండు రోజుల నుంచి నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యక్రమంలో మాత్రం పవన్ పోటో లేకపోవడం రాజకీయవర్గాల్లో దుమారం రేపుతోంది.. ఈ వ్యవహారాన్ని పవన్ పట్టించుకుంటారా..లైట్ తీసుకుంటారా చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news