జనసేనలో బాలినేనికి కష్టాలు..అంతుచూస్తామని బెదిరింపులు !

-

జనసేనలో మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి కష్టాలు తప్పడం లేదు. మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి..జనసేన పార్టీలోకి వెళ్లడాన్ని ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బాలినేని లాంటి వారిని జనసేనలో చేర్చుకోకూడదని పవన్‌ కళ్యాణ్‌ కు చెబుతానని వివరించారు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్.

Damacharla vs Balineni

అయితే.. దీనిపై మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. తనపై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ చేసిన తప్పుడు మాటలు సరికాదంటూ మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అంటున్నారు. ఆయన చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబుకు బాలినేని లేఖ రాసినట్లు తెలిపారు. దామచర్ల వ్యవహార శైలిపై పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు కూడా చేస్తానని చెప్పారు. వైసీపీలో అనేక ఇబ్బందులు కారణంగానే తాను జనసేనలో చేరుతున్నట్టుగా పేర్కొన్నారు. ఈనెల 26వ తేదీన జనసేనలో బాలినేని చేరుతున్నట్లుగా అనౌన్స్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news