హైదరాబాద్‌ లో రాత్రి నుంచి వర్షం..తెలంగాణకు 3 రోజుల పాటు !

-

హైదరాబాద్ లో నిన్నటి నుంచి భారీగా వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో మోస్తారుగా వర్షాలు కురిసాయి. గత రాత్రి ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. మణికొండ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, షేక్ పేట, గచ్చిబౌలి, మేడ్చల్, బోయిన్పల్లి, మెహదీపట్నం, మాదాపూర్, చార్మినార్, ఎల్బీనగర్ వంటి వివిధ ప్రాంతాల్లో తీవ్రంగా వర్షాపాతం నమోదయింది.

Rain in Hyderabad since night Telangana for 3 days

మరో 3 రోజులు కూడా తీవ్రంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని సూచనలు చేస్తున్నారు. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్నాయి. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news