జగన్‌ కు వెన్ను పోటు పొడిచింది…అనిల్ కుమారే – నెల్లూరు డిప్యూటీ మేయర్

-

నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ షాకింగ్‌ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒక ఎక్స్త్ ట్రా ఆర్టిస్ట్ అన్నారు..వైసిపీకి వెన్నుపోటు పొడిచింది అనిల్ అని.. ఈ విషయం అందరికీ తెలుసు అని తెలిపారు. మంత్రి నారాయణ మీద పెట్టిన కేసులు, వేధింపులు ఎవరి మీద ఉండవని వెల్లడించారు. అక్రమ అరెస్టులు, వేధింపులు తట్టుకొని 72 వేల ఓట్ల మెజార్టీతో నారాయణ గెలిచారని.. అనిల్ కుమార్ లాగా భయపడి నియోజకవర్గం నుంచి వెళ్ళిపోలేదని పేర్కొన్నారు.

Nellore Deputy Mayor Roop Kumar Yadav shocking comments

కార్యకర్తల సంక్షేమం కోసం ప్రతి ఏటా పది కోట్లు సొంత నిధులు కార్యకర్తలకు కేటాయించిన నాయకుడు నారాయణ..విపి ఆర్ దంపతుల పేర్లు పలికే అర్హత అనిల్ కు లేదని వివరించారు. ఫతేఖాన్ పేటలో కూల్ డ్రింక్ షాపులో పనిచేసుకునే అనిల్ ఎమ్మెల్యే ఎలా అయ్యాడు.. నెల్లూరు జిల్లాను అనిల్ సర్వనాశనం చేసాడని ఆగ్రహించారు. అనిల్ ను ఎమ్మెల్యే, మంత్రి చేసింది మా లాంటి కార్యకర్తలు..తన దగ్గర 17 ఏళ్ళు ముంచి పనిచేస్తున్న వ్యక్తి నుంచి షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగానికి ఏడు లక్షలు తీసుకున్నాడని తెలిపారు. టిడిపిలోకి వెళ్తున్న కార్పొరేటర్లను జనసేన పార్టీలోకి వెళ్ళమని చెప్పాడని ఆరోపణలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news