చైల్డ్‌ పోర్నోగ్రఫీపై నేడు సుప్రీం కీలకతీర్పు

-

దేశంలో చైల్డ్‌ పోర్నోగ్రఫీ చూడటం నేరమా? కాదా? అనే అంశంపై సోమవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్దీవాలా,జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పు చెప్పనుంది. పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం.. గతంలో చైల్డ్‌ పోర్నోగ్రఫీని చూడటం తప్పు కాదని మద్రాస్‌ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు కావడంతో సుప్రీం కూడా మద్రాస్ హైకోర్టు తీర్పును తప్పుబట్టింది. దీంతో నేడు సర్వోన్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పు చెప్పబోతుందని ఉత్కంఠ నెలకొంది.

అయితే, చైల్డ్‌ పోర్నోగ్రఫీని డౌన్‌లోడ్‌ చేసుకున్నాడనే ఆరోపణల నేపథ్యంలో ఓ 28 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.అతడు వీడియోలు డౌన్‌లోడ్ చేసుకున్నప్పటికీ ఎవ్వరికీ షేర్ చేయలేదు.అంతేకాకుండా ఎవరినీ వేధించలేదు. కావున అతడిపై క్రిమినల్‌ చర్యలను నిలిపి వేయాలంటూ జనవరి 11న మద్రాసు హైకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. అదేవిధంగా పోర్నోగ్రఫీకి అలవాటుపడిన యువతను శిక్షించడం కన్నా వారిని సరైన మార్గం వైపు నడిపించడంపై దృష్టి సారించాలని మద్రాసు హైకోర్టు తన తుది తీర్పులో వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news