నేడు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ భేటీ..!

-

బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్  సమావేశం ఇవాళ జరగనుంది. ఐసిసి  కొత్త ఛైర్మన్  గా BCCI సెక్రటరీ జై షా  ఎన్నికైన తరుణంలో కొత్త కార్యదర్శి నియామకం తప్పని సరి కానుంది. దీంతో బోర్డు కార్యకలాపాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు BCCI ఈ భేటీ నిర్వహించనుంది. కొత్త కార్యదర్శి నియామకం కోసం నామినేషన్ ప్రక్రియ మినహా ఎనిమిది అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుందని తెలుస్తోంది.

BCCI  మాజీ టైటిల్ స్పాన్సర్, బైజూస్ కు సంబంధించి బకాయిలు సెటిల్ చేసుకోవడం BCCI, 2019లో బైజూస్ తో స్పాన్సర్షిప్ ఒప్పందం కుదుర్చుకోగా.. ఆ ఒప్పందం 2023 మార్చిలో ముగిసింది. కానీ బైజూస్ సెప్టెంబర్ 2022 వరకే స్పాన్సర్షిప్ చెల్లింపులు చేసింది. అక్టోబర్ 2022 నుంచి మార్చి 2023 వరకు బైజూస్ బకాయిలు చెల్లించలేదు. దీంతో బకాయిలను రాబట్టేందుకు ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై అపెక్స్ కౌన్సిల్ లో చర్చ జరగనుంది. అలాగే 2023 మార్చిలో బెంగళూరు  శివార్లలో కొత్తగా నిర్మించిన జాతీయ క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవంపైనా, ముంబై లోని BCCI ప్రధాన కార్యాలయం రెన్నొవేషన్  పైనా ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news