హైదరాబాద్ మహానగరంలో ‘హైడ్రా’పేరుతో ప్రభుత్వం హై డ్రామా చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బుధవారం ఆయన కూకట్‌పల్లిలో మాట్లాడుతూ..కాంగ్రెస్ పాలనను నగర ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారని చెప్పారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదల అభ్యున్నతి కోసం పాటుపడిందని గుర్తుచేశారు. తమ పాలనలో నగర అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లను కోటాయించామన్నారు.అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను కూడా మెరుగుపరిచామని వెల్లడించారు.
కానీ,10 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క మంచి కూడా జరిగిన దాఖలాలు లేవన్నారు. నేటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు.హైదరాబాద్ ట్రాఫిక్ విషయానికొస్తే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని దుయ్యబట్టారు.వర్షం వస్తే ఎక్కడపడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోందని విమర్శించారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం నిరుపేదల ఇళ్లను నేలమట్టం చేస్తూ హై డ్రామాలు చేస్తుందని ఫైర్ అయ్యారు. ఆక్రమణలు కూల్చాలని ప్రభుత్వం భావిస్తే బాధితులకు ప్రత్నామ్నాయం చూపి ఆ పని చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.