గత ప్రభుత్వం గండ్లు పూడ్చకపోవడం వల్లనే బుడమేరుకు వరద ప్రవాహం వచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు సీఎం చంద్రబాబు. ఒకటికి నాలుగు సార్లు రోజువారిగా తిరిగానని వెల్లడించారు. డేంజర్ ఏరియాల్లో రోజుకు అధికసార్లు పర్యటించానని తెలిపారు. మనో ధైర్యాన్ని నింపగలిగామని తెలిపారు.
ఊహించని రీతిలో బుడమేరుకు వరద పోటెత్తింది. వరద సమయంలో ఉద్యమ స్ఫూర్తితో పని చేశామని తెలిపారు. పది రోజుల్లో 1కోటి 15లక్షల ఫుడ్ ప్యాకెట్ పంపిణీ చేశామని తెలిపారు. వాటర్ చాలా ట్యాంకర్లతో సరఫరా చేశామని తెలిపారు చంద్రబాబు. ఈనెల 30వరకు అందరికీ సహాయం చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. శానిటేషన్ 20వేల మెట్రిక్ టన్నుల గార్బిక్ తీశామని తెలిపారు. సీఎం సహాయనిధికి రూ.400 కోట్లు వచ్చాయని తెలిపారు చంద్రబాబు. ఈ అనుభవంతో ఇలాంటి వరద వస్తే.. మరోసారి ముందస్తుగా చర్యలు తీసుకునేందుకు ఇది ఉపయోగపడిందని తెలిపారు.