జీవితం చాలా విలువైనది అంటూ.. జూనియర్ ఎన్టీఆర్ వీడియో షేర్..!

-

‘జీవితం చాలా విలువైనది.. రండి నాతో చేతులు కలపండి. . మన దేశ భవిష్యత్తు మన యువత చేతిలోనే ఉంది’ అని యంగ్ టైగర్  ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్ టీమ్ కి సహకరిస్తూ తనవంతు బాధ్యతగా ఎక్స్ వేదికగా ఎన్టీఆర్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి యువత సహకరించాలంటూ వీడియోలో  పిలుపునిచ్చారు ఎన్టీఆర్. ఎంతో మంది యువత డ్రగ్స్కు ఆడిక్ట్ అయి తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమో, క్షణికమైన ఒత్తిడీ నుంచి బయటపడటం కోసమో లేదంటే సహచరుల ప్రభావం వల్లనో, స్టైల్ డ్రగ్స్ కి ఆకర్షితులు కావడం చాలా బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వినియోగిస్తున్నా వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సమాచారం అందించాలని సూచించారు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ హీరో సినిమా అయినా ఆ సినిమా సంబంధించిన హీరో, హీరోయిన్ డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఓ వీడియో చేసివ్వాలని కోరిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా దేవర సినిమా 27న విడుదల కానుండటంతో ఎన్టీఆర్ ఓ వీడియో చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news