ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలైన ఘటన నక్కపల్లి జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గొడిచెర్లకు చెందిన కిల్లాడ నాగేశ్వరరావు (24), ఆవాల నవీన్ (18) దేవవరానికి చెందిన దమ్ము సీతయ్య ముగ్గురు కలిసి ద్విచక్ర వాహనంపై వేంపాడులోని ఓ దాబాలో టిఫిన్ చేసేందుకు వెళ్లారు.
మరల తిరిగి ఇంటికి వెళ్లున్న క్రమంలో ఉద్దండపురం శివారులోకి రాగానే అతివేగంతో ముందుగా వెళ్తున్న లారీని వేగంగా వీరి వాహనంతో ఢీకొట్టారు.ఈ ఘటనలో నాగేశ్వరరావు, నవీన్ అక్కడికక్కడే మృతి చెందగా.. సీతయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న నక్కపల్లి సీఐ కుమార స్వామి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. గాయపడిన సీతయ్యను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. యాక్సిడెంట్‌కు అతివేగమే కారణమని నిర్దారించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.