Telangana RTC : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్. ఇవాళ రెండు ఈ-గరుడ బస్సులు ప్రారంభం కానున్నాయి. ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు ఈ-గరుడ ఏసీ బస్సులు ప్రారంభం కానున్నాయి. మొదటి దశలో భాగంగా ఇవాళ రెండు ఈ-గరుడ బస్సులు ప్రారంభం అవుతాయి.
ఈ మేరకు ఎక్స్ లో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటన చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా, నిన్న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎండీ వి.సి సజ్జనార్, ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ , మేడిపల్లి సత్యం ,డాక్టర్ సంజయ్ లతో కలిసి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 500 ఎలక్ట్రిక్ బస్ లని మొదటి విడత గా ప్రారంభిస్తున్నామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలు కూడా అమలు చేస్తామని ప్రకటించారు మంత్రి పొన్నం.