మూసీ బాధితుల పేరిట 5 వేలు డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నారని బీఆర్‌ఎస్ పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు. సీఎం రేవంత్ రెడ్డిని తిట్టిస్తున్నారని ఆగ్రహించారు. మూసి పైన అవకాశవాద శక్తులు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. మూసి ప్రక్షాళన కోసం మూసి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకొని ముందుకు వెళుతున్నట్టు తెలిపారు.
హైదరాబాదును విశ్వ నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చెరువులను మూసి ఆక్రమణలను తొలగిస్తున్నామని తెలిపారు. తెలిసో తెలియకను కొందరు మూసిలో ఇండ్లు ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్నారు.. అలాంటి పేదలను నిలబెట్టాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశం. పడగొట్టాలని కాదు అని చెప్పారు. మూసి రివర్ బెడ్ లో ఉన్న అక్రమకు నిర్మాణాలను మాత్రమే తొలగిస్తున్నామని స్పష్టం చేశారు.