నయీంనగర్ బ్రిడ్జిపై దాస్యం వినయ్ కౌంటర్‌…పనులు చేస్తే..మీరు ఫోటోలు దిగుతున్నారు !

-

నయీంనగర్ బ్రిడ్జిపై దాస్యం వినయ్ కౌంటర్‌ ఇచ్చారు. MLA నాయిని రాజేందర్ రెడ్డిను ఉద్దేశించి..మాజీ MLA వినయ్ భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. BRS ప్రభుత్వం చేసిన పనుల ముందు ఫోటోలు దిగుతున్నావు….హనుమకొండలో వరదలు వస్తే కేసీఆర్ 250 కోట్ల నిధులు విడుదల చేశారన్నారు. నాలా రిటైనింగ్ వాల్ సమ్మయ్య నగర్ బ్రిడ్జి నిర్మాణాలు పూర్తి చేశామని.. నయీమ్ నగర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ వచ్చిందని తెలిపారు.

నేను తెచ్చిన పనులకు కొబ్బరికాయలు కొడుతూ ఫోటోలు దిగుతున్నావు… నా దమ్ము ఏందని ప్రశ్నిస్తున్నావు రాజేందర్ రెడ్డి…నా దమ్మేంటో తెలంగాణ ఉద్యమ సమయంలో చూశారన్నారు. సమైక్యవాదులకు వత్తాసు పలికితే మానుకోట బిడ్డలు నీపై దాడి చేశారు…. రైల్లో దాచుకొని తుపాకీతో ఉద్యమకారులను కాల్చిన చరిత్ర నీది అంటూ ఆగ్రహించారు. 420 హామీలు తీర్చలేక రోజుకో డ్రామాలు చేస్తున్నారు… సమయం ఇద్దామనుకున్న నన్ను పదేపదే గెలుకుతున్నావని వెల్లడించారు. నేను ఎక్కడికి వెళ్లినా నాపై దుష్ప్రచారం చేస్తున్నావు… నీవు ఎక్కడికి వెళ్లి ఏం చేస్తున్నావో బయట పెట్టమంటావా? అంటూ సవాల్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news