మహాభారతం నుండి ప్రతీ ఒక్కరూ.. ఈ విషయాలను నేర్చుకోవాలి..!

-

మహాభారతం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మహాభారతంలో లేనిది ఏది కూడా లేదు. ఆనందం నుంచి అసూయ దాకా చాలా ఇందులో ఇమిడి ఉన్నాయి. విద్యార్థులకు ప్రేరణ ఇచ్చే కొన్ని అంశాలు కూడా మహాభారతంలో ఉన్నాయి. విద్య అనేది ఒక వ్యక్తి జీవితంలో ముఖ్యమైనది. ఇక్కడే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం నిర్మితమవుతుంది. మహాభారతం ఇతిహాసాల నుంచి విద్యార్థులు నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అర్జునుడు గొప్ప విలుకాడు.

ప్రధాన పాత్రలో ఆయన కూడా ఒకరు. అతని నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఒకసారి ద్రోణాచార్యుడు తన శిష్యులైన పాండవులు కౌరవులని పరీక్షించాలని అనుకుంటాడు. చెట్టుపై ఉన్న పక్షి కన్ను కొట్టాలని చెప్తాడు తన శిష్యులు అందర్నీ మీకేం కనిపిస్తోందని అడుగుతాడు. కొందరు పక్షి అని చెప్తారు కొందరు చెట్టు అని చెప్తారు. కానీ అర్జునుడు మాత్రం పక్షి కన్ను మాత్రమే కనపడుతుందని చెప్తాడు.

పక్షి కన్నుని గురి చూసి కొడతాడు పని పట్ల ఏకాగ్రత లక్ష్యం నిర్దేశించుకోవడం అర్జునుడిని చూసి నేర్చుకోవాలి. సగం జ్ఞానం ఎప్పుడూ కూడా వినాశకరమే. మహాభారత యుద్ధ సమయంలో కౌరవులు చక్రవ్యూహాన్ని న్నారు. చక్ర వ్యూహాల్లో ఎలా ప్రవేశించాలో మాత్రమే అతనికి తెలుసు. పాక్షిక జ్ఞానం వలన అతను ప్రాణాల్ని పోగొట్టుకుంటాడు ఏదైనా అంశం గురించి పూర్తి జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నించాలని అభిమన్యుడు కథ చెప్తోంది. అలాగే మహాభారతం స్నేహబంధాలు కూడా ఎంతో ముఖ్యమని చెప్తోంది.

మహాభారతం కృష్ణుడు పాండవులను ధర్మ మార్గంలో నడిపించాడు. శకుని కౌరవులని నాశనమయ్యేలా చేశాడు కాబట్టి ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారో మీ జీవితం కూడా అలానే మారుతుంది. అహంకారం అనేది ప్రతి విద్యార్థి కూడా వదిలేసుకోవాలి. మహాభారతంలో దుర్యోధనుడి అహంకారమే కురుక్షేత్ర యుద్ధానికి దారితీస్తుంది. పాండవులు ఆనందంగా ఉండడాన్ని విజయం సాధించడానికి భరించలేకపోయాడు. దుర్యోధనుడు అహంకారంతో విర్రవీగాడు చివరకు అతను పతనమయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news