నీకు దమ్ముంటే..నా కొడుకుల ఫాంహౌజులు కూల్చేయ్‌ – సబితా సవాల్‌

-

నీకు దమ్ముంటే..నా కొడుకుల ఫాంహౌజులు కూల్చేయ్‌ అంటూ రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి సబితా సవాల్‌ విసిరారు. మహేశ్వరం నియోజకవర్గం లో రైతు ధర్నా కు పిలుపునిచ్చింది బీఆర్‌ఎస్‌ పార్టీ. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా మాట్లాడుతూ… ఈ మధ్య ముఖ్యమంత్రి మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడు తున్నారని… నా కొడుకుల పేరు మీద ఫార్మ్ హౌస్ లు ఉన్నాయి అంటున్నారన్నారు. ఎక్కడ ఉన్నాయో చూపించాలని… మాకు ఫార్మ్ హౌజ్ లు ఉంటే వెంటనే కూల్చoడి అంటూ సవాల్‌ చేశారు.

sabitha warns cm revanth reddy

పేదల మీదకు బుల్డోజర్లు పంపు తున్నావ్… నీకు దమ్ముంటే నాకు ఉన్నాయి అని చెబుతున్న ఫార్మ్ హౌజ్ లు కూల్చoడి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇష్యూ డైవర్ట్ కావడం కోసం మహిళా మంత్రి తో ఇష్టం వచ్చినట్టు గా మాట్లాడిస్తున్నారని ఆగ్రహించారు. సభ్య సమాజం తల దించేకునేలా ఆ మంత్రి మాట్లాడారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి సబితా.

Read more RELATED
Recommended to you

Latest news