జమ్మూలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ కుట్రలు – సీపీఐ నారాయణ

-

జమ్మూలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నక్సలిజం పైన అమిత్ షా సమావేశం పై స్పందించిన నారాయణ… దేశంలో రేపులు, మర్డర్స్, జరుగుతున్నాయి .. వాటిపై ఫోకస్ పెట్టాలని కోరారు. మోడీ ఇజ్రాయెల్ మోడల్ ను అమలు చేస్తున్నారని.. అన్నలు ఆలోచించాలి, మారిన పరిస్థితులకు అనుగుణంగా ఉద్యమాల్లో మార్పులు తెచ్చుకోవాలని వివరించారు. ప్రజలతో కలిసి పోరాడాలని కోరారు. రేపులు చేసే వాళ్లకు బెయిల్ ఇస్తున్నారని.. డేరా బాబాకు బెయిలిచ్చారు, ఆయనకు ఎన్నికల వచ్చాయని బెయిల్ ఇచ్చారన్నారు.

 

ఘోరాతి ఘోరాలు చేసిన డేరా బాబాకు పంజాబ్, హర్యానా ఎన్నికల సమయంలో బెయిల్ ఇచ్చారు… వరవరరావు లాంటి వాళ్లకు మాత్రం బెయిల్ రాదని నిప్పులు చెరిగారు. ఆయన మాత్రం బాంబేలోనే ఉండాలి… జమ్ము కాశ్మీర్లో దొడ్డి దారిన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బిజెపి ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఆరోపణలు చేశారు.

జమ్ము కాశ్మీర్లో ఐదు మంది ఎమ్మెల్యేలను ముందే నామినేట్ చేశారని.. రేపు ఓట్ల లెక్కింపు సమయంలో, సీట్లు గెలవకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బిజెపి ప్రయత్నాలు జరుపుతున్నట్లు చెప్పారు. ప్రజల మద్దతు ఉంటే బిజెపి ఇలా ఎందుకు చేస్తుంది… ప్రధాని మోడీ విదేశీ పర్యటనలన్నీ నిష్ప్రయోజనమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news