బిగ్ బాస్ హౌస్ ఓటింగ్ రివర్స్.. ఆమె ఎలిమినేట్ అవ్వనుందా..?

-

బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు జోరుగా సాగుతోంది. గత రెండు రోజులుగా హౌస్ లో బిగ్ బాస్ హోటల్ టాస్క్ అవుతోంది. బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చిన వారి నుంచి మెగా చీఫ్ కంటెండర్లు ని సెలెక్ట్ చేసి వచ్చేవారానికి మెగా చీఫ్ ని సెలెక్ట్ చేశారు. ఐదో వారం ఎనిమిది మంది వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ అడుగుపెట్టిన విషయం తెలిసిందే. క్లాన్ మెంబర్స్ ని నామినేట్ రాయల్ సభ్యులు ఇద్దరిని నామినేట్ చేసి ఎలిమినేషన్ లో ఉంచారు. దీంతో రెండు రోజులపాటు సాగిన బిగ్ బాస్ తెలుగు ఓటింగ్ ఆరో వారం నామినేషన్స్ లో టోటల్ గా ఆరుగురు నామినేట్ అయ్యారు. అయితే నామినేషన్స్ ప్రక్రియ పూర్తయినప్పటి నుంచి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యాయి.

గంగవ్వ టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఇప్పుడు కూడా టాప్ వన్ స్థానంలోనే కొనసాగుతున్నారు. గత వారం నెగిటివిటీ తెచ్చుకున్న యష్మీ ఈ వారం బెటర్ గా క్యూట్ గా పర్ఫామెన్స్ తో ఓటింగ్ పై పైకి వచ్చేసింది. రెండవ స్థానంలో యాష్మి ఉంది మూడవ స్థానంలో మహబూబ్ డేంజర్ జోన్లో పృథ్వీరాజ్ ఉన్నారు. పృథ్విరాజ్ స్థానంలోకి విష్ణుప్రియ వెళ్ళింది.

బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్ మెటీరియల్ గా అడుగుపెట్టిన విష్ణు ప్రియ లవ్ ట్రాక్ ని నమ్ముకుని చేతులారా గేమ్ ని పాడు చేసుకుంటోంది. మొదటి నుంచి ఓటింగ్ లో మంచి ప్లేస్ లో ఉన్న విష్ణు ప్రియ డేంజర్ లో పడిపోయింది. ఆరో స్థానంలో సీత ఉంది వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వచ్చు. విష్ణు ప్రియ కంటే తక్కువ ఓట్లు సీతకి ఉన్నాయి కాబట్టి ఆమె ఎలిమినేట్ అయ్యేటట్టు కనపడుతోంది. మరి విష్ణు ప్రియ సీట్లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news