ఖలీస్తాన్ తీవ్రవాది నిజ్జర్ హత్యకేసులో కెనడా యూటర్న్..

-

ఖలీస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత్ కుట్ర పన్నిందని, అతని హత్యకేసులో భారత్ ఏజెంట్ల హస్తముందని ముందు నుంచి ఆరోపిస్తున్న కెనడా ఒక్కసారిగా మాటమార్చింది. కెనడా ప్రధాని ట్రూడో ఇటీవల చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య దౌత్య సంక్షోభానికి దారితీశాయి. తమ పౌరుడైన నిజ్జర్‌ను తమ దేశంలోనే భారత ఏజెంట్లు బిష్ణోయ్ గ్యాంగ్ సహకారంతో హతమార్చిందని కెనడా పోలీసులు ఆరోపించిన విషయం తెలిసిందే.

ఈ కేసు దర్యాప్తునకు సహకరించాలని భారత్‌ను కోరుతూ అందుకు సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించామని కెనడా చెబుతూ వచ్చింది. అయితే, కెనడా ఆరోపణలన్నీ అవాస్తవాలని, అందుకు తగిన ఆధారాలు చూపించాలని భారత్ స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో కెనడా పీఎం జస్టిన్ ట్రూడో తాజాగా చేసిన వ్యాఖ్యలు భారత్ పై చేసిన కామెంట్స్ అవాస్తవాలని తెలుస్తోంది. తమ వద్ద కేవలం ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఆధారాలు మాత్రమే ఉన్నాయని, హార్డ్ ప్రూవ్ లేదని చెప్పడంతో కెనడా చేస్తున్న ఆరోపణలు కట్టుకథే అని నిరూపితమైంది.

Read more RELATED
Recommended to you

Latest news